![]() |
![]() |

చిన్న సినిమాలైన, పెద్ద సినిమాలైన ఆడియన్స్ థియేటర్ లో కంటే ఓటీటీలలోనే ఎక్కువగా చూస్తున్నారు. ప్రతీ సంవత్సరం తెలుగులో కంటే ఇతర భాషలలోని క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో మలయాళంలో ఈ సంక్రాంతికి విడుదలై అక్కడ బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసిన ఓ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వనుంది.
మిధున్ మాన్యవల్ థామస్ దర్శకత్వం వహించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ' అబ్రహామ్ ఓజ్లర్ '. జయరాం, అనూప్ మీనన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద నలభై(40) కోట్లకి పైగా వసూళ్ళని రాబట్టింది. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమైంది. మార్చి 20వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అబ్రహమ్ ఓజ్లర్( జయరాం ) ఓ ఐపీఎస్ ఆఫీసర్.. ఒకరోజు సడన్ గా అతని భార్యాపిల్లలు కనపడకుండా పోతారు. అదే సమయంలో సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అదే క్రమంలో అలెక్స్ పాత్రలో మమ్ముట్టి తెరమీదకి వస్తాడు. అసలు అలెక్స్ కి ఆ హత్యలకి సంబంధమేంటి? అసలు ఆ హత్యలు చేస్తుందెవరో ఓజ్లర్ కనిపెట్టాడా? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఎందుకు దోషిలా మారాడనేది ఈ సినిమా కథ.. మరి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో జయరాం నటనకి గుర్తింపు లభించింది. మరి ఈ సినిమా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |