![]() |
![]() |

ఈమధ్య సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించిన సినిమాలు కూడా.. సీక్వెల్ బాట పడుతున్నాయి. ఇప్పుడు 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమా వంతు వచ్చింది. 2022 ఆగస్టులో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది రచయితగా వ్యవహరించగా.. అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండగా.. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటం విశేషం.
తాజాగా 'ఓదెల రైల్వే స్టేషన్' సీక్వెల్ ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి 'ఓదెల' అనే టైటిల్ పెట్టారు. ఇందులో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సీక్వెల్ కి కూడా సంపత్ నంది నే కథ అందిస్తుండగా.. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. సంపత్ నంది టీం వర్క్స్ తో కలిసి మధు క్రియేషన్స్ బ్యానర్ పై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కథలో మైథలాజికల్ టచ్ ఉంటుందట. తమన్నా మునుపెన్నడూ చేయని పాత్ర పోషిస్తుందని చిత్రం బృందం చెబుతోంది. ఆమె ఈ తరహా రోల్ చేయడం మొదటిసారి అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు(మార్చి 1) కాశీలో ప్రారంభమైంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

![]() |
![]() |