![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ సినిమా 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. త్వరలో ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. అది కూడా రెండు ఓటీటీ వేదికల్లో విడుదలవుతుండటం విశేషం.
'ఈగల్' మూవీ ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ దక్కించుకున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ ని రివీల్ చేయనప్పటికీ.. మార్చి మొదటి వారం నుంచి స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు 'ఈగల్' డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చి చేరింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియో. త్వరలో 'ఈగల్' సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రకటించింది.

అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించాడు.
![]() |
![]() |