![]() |
![]() |
అతని పేరు తరుణ్ కార్తికేయన్.. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయిన శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. ఇప్పుడు శంకర్‌కి అల్లుడు కాబోతున్నాడు. ఇప్పుడీ వార్త సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే శంకర్ కూతురు ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి.
వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ శంకర్ రెండో కూతురు ఐశ్వర్య శంకర్.. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో లవ్‌లో పడిరది. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు. ఆదివారం తరుణ్, ఐశ్వర్యల ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఐశ్వర్యకు రోహిత్ అనే వ్యక్తితో ఇదివరకే పెళ్ళయింది. అయితే కొన్ని కారణాల వల్ల అతని నుంచి విడాకులు తీసుకుంది. శంకర్ దగ్గర పనిచేస్తున్న తరుణ్‌తో ప్రేమలో పడిరది. ఆమె మొదటి భర్త రోహిత్ గతంలో ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఆ కారణంతోనే అతని నుంచి ఐశ్వర్య విడిపోయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
ఇక శంకర్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ మొదలైందట. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల డిలే అవ్వడంతో ‘ఇండియన్2’ని పూర్తి చేయాలనుకున్నాడు. అందుకే మధ్యలో ఆ సినిమా పనిలో బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండడం, సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంపై మెగా ఫ్యాన్స్ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తాడో, ఎప్పుడు రిలీజ్‌కి తీసుకొస్తాడో శంకర్‌కే తెలియాలి.
![]() |
![]() |