![]() |
![]() |

హీరోల డేట్స్ కోసం దర్శకుడు వెయిట్ చేసే రోజుల్లో దర్శకుడు డేట్స్ కోసం హీరోలు వెయిట్ చేసేలా చేసిన గొప్ప దర్శకుడు స్వర్గీయ కె విశ్వనాధ్ గారు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా సినిమా అనేది ఒక పవిత్రమైన కళ అనే భావనని ప్రేక్షకులకి కలుగచేస్తాయి. అందుకే ఆ చిత్రాలు నేటికీ కళాఖండాలుగా అందరి మదిలో నిలిచిపోయాయి.ఈ రోజు ఆ కళాతపస్వి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ తీసుకున్న ఒక నిర్ణయం ప్రాధాన్యతని సంతరించుకుంది.
విశ్వనాధ్ గారి పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ కాశీనాధుని విశ్వనాథ్ అవార్డుని తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో చదివే విదార్థులకి కాశీనాధుని విశ్వనాథ్ అవార్డు ని ఇవ్వనున్నారు. నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఇద్దరిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 25000 ఇవ్వనున్నారు. ఇలా ప్రతి సంవత్సరం అవార్డు ని ఇస్తారు.

ఇక అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా ప్రధానంగా నటుల్ని తయారు చేస్తుంది.ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ యాక్టింగ్ స్కూల్ ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థలో నటన నేర్చుకుంటున్న విద్యార్థులు విశ్వనాధ్ గారి లెజెంట్ అవార్డు అందుకోవడం నిజంగా వాళ్ల అదృష్టం.అలాగే అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్ కి కూడా గర్వకారణం అని చెప్పవచ్చు.ఈ మేరకు విశ్వనాధ్ గారి కూతురు, కొడుకు అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున,అమల ని కలిశారు.అందరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగార్జున విశ్వనాధ్ గార్లు కలిసి వజ్రం మూవీ లో తండ్రి కొడుకులుగా నటించారు.అలాగే సంతోషం మూవీలో కూడా కలిసి నటించారు.
![]() |
![]() |