![]() |
![]() |

నయా పెళ్లి సందడి తో సినీ కెరీర్ ని ప్రారంభించి చిన్న హీరో పెద్ద హీరో అనే తేడాలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్తున్ననటి శ్రీలీల.అతి తక్కువ వ్యవధిలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఆమె తాజాగా తిరుమలకి వెళ్ళింది. ఈ సందర్భంగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి.
భక్త వల్లభుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి ఏడుకొండల వాడిని శ్రీలీల కొద్దిసేపటి క్రితమే దర్శనం చేసుకుంది. నుదుటిన విష్ణు నామాలు పూసుకొని పూర్తి సాంప్రదాయ బద్దమైన రీతిలో స్వామిని దర్శించింది. అనంతరం బయటకి వచ్చిన శ్రీలీల ఒక భక్తుడి కోసం ప్రసాదం తీసుకొచ్చింది. నన్ను ప్రసాదం తీసుకురమ్మన్న వ్యక్తి ఎక్కడ అని అడిగింది. ఆ తర్వాత వేరే వ్యక్తి నాకు ఇవ్వండి మేడం అని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటల తాలూకు వీడియో హల్ చల్ చేస్తుంది.
ఆ తర్వాత అక్కడున్న మీడియాతో ముచ్చటించింది. తన మొదటి సినిమా పెళ్లి సందడి టైంలో తిరుమల వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నానని మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చానని చెప్పింది. అలాగే చిన్నప్పటి నుంచి తిరుమలకి రావటం అలవాటని కూడా చెప్పింది. ఇక శ్రీలీల ని చూడటంతో చాలా మంది ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.లేటెస్ట్ గా గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన శ్రీలీల వెంట ఆమె తల్లి కూడా ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంది.
![]() |
![]() |