![]() |
![]() |

'దేవర' సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఒక విషయంలో వారు తెగ ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది.
ఎన్టీఆర్ గతంలో 'ఆంధ్రావాలా', 'శక్తి' సినిమాల్లో తండ్రిగా, కొడుకుగా డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. అయితే ఆ రెండు సినిమాలు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమా పేర్లను తలచుకోవడానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు పెద్దగా ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు ఆ సినిమాల మాదిరిగానే.. 'దేవర'లో కూడా తారక్ తండ్రికొడుకులుగా నటిస్తున్నాడనే న్యూస్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మరి ఎన్టీఆర్ ఈ సినిమాతోనైనా ఆ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |