![]() |
![]() |
.webp)
మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం 'ఈగల్'తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఈ సినిమా పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఈగల్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. పది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.51.4 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఇతర పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో.. ఈగల్ మూవీ ఫుల్ రన్ లో రూ.60 నుంచి రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించాడు.
![]() |
![]() |