![]() |
![]() |

ప్రముఖ నటుడు శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'పిండం'. గతేడాది డిసెంబర్ 15న మోస్ట్ స్కేరియెస్ట్ ఫిల్మ్ గా థియేటర్స్ లో అడుగు పెట్టిన ఈ సినిమా.. మంచి స్పందనే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి పిండం సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఆహాలో అందుబాటులో ఉంది.
హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా ఈ సినిమాను రూపొందించారు సాయి కిరణ్ దైదా. దీంతో థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిండం చిత్రానికి అటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ, ఇటు ఆహాలో మంచి ఆదరణ లభిస్తోంది.
కళాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించారు.
![]() |
![]() |