![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు మూవీ లవర్స్ కి కూడా పండగే. తను చేసే ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు పోలిక ఉండదు. కొత్త దనంతో కూడుకున్న సినిమాలు చెయ్యడంలో పవన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు ఆ కోవలోనే ఓజి మూవీ తెరకెక్కుతుంది.తాజాగా ఓజి కథ ఇదేనంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ప్రస్తుతం ఉన్న కాలానికి కంటే ముందు అంటే సుమారు ఒక పదేళ్ల క్రితం ముంబై నగరంలో ఓజాస్ గంభీర అనే ఒక గ్యాంగ్ స్టర్ ఉండేవాడు.అతని ఆధ్వర్యంలో ఎన్నో గ్యాంగ్ గ్రూప్స్ ఉండేవి. వాళ్లందరికీ ఓజాసే బాస్. కానీ ఒక రోజు సడన్ గా ఓజాస్ మాయం అవుతాడు.అలాంటిది మళ్ళీ శత్రు మూకలపై రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడు. ఓజి మూవీ మూల కథ అదే అనే ప్రచారం ఐఎండిబి లో వస్తుంది.ఓజి కి సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్న మేకర్స్ మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఓజి కథ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక ఓజి నుంచి ఫస్ట్ గ్లింప్ రిలీజ్ అయినప్పుడే పవన్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడని అజ్ఞ్యాతంలో ఉన్న తాను మళ్ళీ వచ్చాడు అనే రీతిలో దర్శకుడు సుజీత్ చూపించాడు.ఏది ఏమైనా ఓజి కోసం పవన్ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు.డివివి ఎంటర్టైన్ మెంట్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ పవన్ తో జత కడుతున్న ఓజి సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
![]() |
![]() |