![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి తన నయా మూవీ విశ్వంభర షూటింగ్ కి కొంచం గ్యాప్ ఇచ్చి మొన్న వాలంటైన్స్ డే రోజున తన సతీమణి సురేఖ తో కలిసి అమెరికా వెళ్ళాడు.ఈ సంధర్భంగా తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు నిర్మిస్తున్న ఒక బడా నిర్మాత చిరంజీవిని కలిసాడు.తాజాగా ఆ నిర్మాత తన ట్విటర్ వేదికగా చెప్పిన విషయం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
టి.జె విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై కంటిన్యూగా సినిమాలు నిర్మించుకుంటూ వస్తున్న ఆయన తాజాగా అమెరికాలో ఉన్న చిరంజీవిని కలిసాడు. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సంధర్భంగా సన్మానించాలని అనుకున్న ఆయన తన కోరికని చిరు దగ్గర వెల్లడి చేసాడు.సన్మానానికి చిరు కూడా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని విశ్వప్రసాద్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసాడు.పైగా చిరుతో కలిసి దిగిన పిక్ ని కూడా షేర్ చేసాడు. అలాగే చిరుని కలవడం చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పాడు.చిరుతో విశ్వ ప్రసాద్ దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇక గత కొన్నిరోజుల నుంచి విశ్వప్రసాద్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల లిస్ట్ లో చిరంజీవి సినిమా కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరు ని ఆయన కలవడం ఆ వార్తలకి బలాన్ని చేకూరుస్తుంది. పైగా ఆ మూవీకి హరీష్ శంకర్ దర్శకుడు అని కూడా అంటున్నారు. ఈ వార్తలే కనుక నిజమైతే ఇక మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. ఏ మాత్రం ఖర్చుకు వెనకాడని విశ్వప్రసాద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ అండ్ మాస్ లో క్లాస్ ని మిక్స్ చేసే దర్శకుడు హరీష్ లు చిరు కి తోడయ్యితే ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపడం ఖాయం.
![]() |
![]() |