![]() |
![]() |

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన స్టార్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 మూవీతో ఆమె సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో సైతం పాయల్ పేరు మారుమోగిపోయింది. కుర్రకారు కలల యువరాణిగా కూడా ఆమె కీర్తిని సంపాదించింది. తాజాగా ఆమె గురించిన ఒక వార్తలు చెక్ పడింది
పాయల్ వాలైంటైన్స్ డే సందర్భంగా నిన్న తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పబ్ కి వెళ్ళింది. ఆ తర్వాత పాయల్ ఒక పెద్ద బాటిల్ తో తన బాయ్ ఫ్రెండ్ తల పగల కొట్టి ఆక్కడి నుంచి చాలా కోపంగా వెళ్లిపోయింది. దీంతో ఆ ఘటన వైరల్ గా మారింది. పైగా సోషల్ మీడియాలో కూడా ఆ వార్త ప్రచారం కావడంతో పాయల్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే అది నిజంగా జరిగిన సంఘటన కాదు. ఒక షూటింగ్ సందర్భంగా పాయల్ అలా చేసింది.ఆ వీడియోని అన్ని ఆధారాలతో సహా పాయల్ తన ఇనిస్టాగ్రమ్ లో షేర్ చేసింది.ఆ వీడియోలో చాలా క్లియర్ గా అదంతా షూటింగ్ అనే విషయం అర్ధం అవుతుంది
ఆర్ డిఎక్స్ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో ఇంక పాయల్ తెలుగు నుంచి గాయబ్ అని అందరు అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా మంగళవారం మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఆల్ రెడీ అనగనగ ఓ అతిధి, 3 రోజెస్ లో చేసింది.
![]() |
![]() |