![]() |
![]() |
ఎన్టీఆర్ హీరోగా ‘ఆది’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వి.వి.వినాయక్.. ఆ సినిమాతో హీరోయిజాన్ని పర్‌ఫెక్ట్‌గా ఎలివేట్ చేయగల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన చాలా సినిమాలు దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే గత కొన్నేళ్లుగా అతని డైరెక్షన్‌లో పదును తగ్గిందనే వాదన వినిపిస్తోంది. దానికి తగ్టట్టు అపజయాలు అతన్ని వెంటాడుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వినాయక్ ఆ తర్వాత సాయిధరమ్‌తేజ్‌తో చేసిన ‘ఇంటిలిజెంట్’ డిజాస్టర్ అవ్వడంతో ఐదేళ్ళపాటు మరో సినిమా జోలికి వెళ్ళలేదు. గత సంవత్సరం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. అది కూడా పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆ తర్వాత మరో సినిమా ఎనౌన్స్ చెయ్యలేదు. తాజాగా ఓ యంగ్ హీరోతో తన నెక్స్‌ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు వినాయక్.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం టాప్ హీరోలతో వినాయక్ సినిమా చేసే అవకాశం లేదనేది అర్థమవుతోంది. అందుకే ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ‘పెదకాపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణతో వినాయక్ తదుపరి సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. పలు భారీ చిత్రాలతో టాలీవుడ్‌లో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మిర్యాల రవీందర్‌రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ. మొదటి సినిమా ‘పెదకాపు’ చిత్రం అతనికి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. వినాయక్‌కి కూడా ఒక సూపర్‌హిట్ అవసరం. అందుకే కర్ణ కోసం ఒక యాక్షన్ బేస్డ్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
![]() |
![]() |