Home  »  News  »  ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకల్ని జరిపించిన చరణ్ వైఫ్ ఉపాసన.. ఆడపిల్లలు ఎదగాలి  

Updated : Feb 6, 2024

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినటువంటి  ఉపాసన కొణిదెల గురించి కొత్తగా ఎవరకి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.ఒక లెజెండరీ కుటుంబం నుంచి వచ్చిన ఉపాసన  ఒక సామాన్య వ్యక్తి గా తన జీవనాన్ని కొనసాగిస్తు ఉంటుంది. అలాగే సమాజానికి సేవ చెయ్యాలనే తలపుతో ఎన్నోసామాజిక సేవా కార్యక్రమాలు చేస్తు ఎంతో మందికి ఇనిస్పిరేషన్ గా కూడా ఉంటుంది. అలాగే ఎంతో మందికి మోటివేట్ గా కూడా నిలిచే ఉపాసన కి సంబంధించిన తాజా న్యూస్ ఇప్పుడు తెలుగు నాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఉపాసన తాత అపోలో వ్యవస్థాపకులు అయిన ప్రతాప్ రెడ్డి  అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన ఇటీవల తన 91 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా  చెన్నైలో ఉన్న అపోలో లో బర్త్ డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకులని ఉపాసన దగ్గర్నుండి మరి జరిపించింది. అలాగే  తన తాతకి బెస్ట్ విషెస్ చెప్తు ది అపోలో స్టోరీ అనే బుక్ ని ప్రతాప్ రెడ్డి కి  గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ బుక్ లో అపోలో ఎలా పుట్టింది  అపోలో  ద్వారా ప్రజలకి ఉన్నతమైన వైద్యాన్ని అందించడానికి ప్రతాప్ రెడ్డి ఎంత కష్టపడ్డారు అనే విషయాలు వివరంగా ఉన్నాయి.దాంతో పాటు ప్రతాప్ రెడ్డి కన్న కలలని ఆయన మనవరాళ్లు నిలబెట్టడానికి ఎలా ప్రయత్నిస్తు ఉన్నారో కూడా వివరంగా ఉంది.  బుక్ లో ఉన్న ఈ  విషయాలన్నింటిని  ఉపాసనే స్వయంగా చెప్పింది.

అలాగే ది అపోలో స్టోరీ  పుస్తకం చదివి ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాధించడానికి కృషి చెయ్యాలని  తల్లి తండ్రులు కూడా  ఆడపిల్లలలని ప్రోత్సహించాలని ఉపాసన కోరింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కి చెందిన అమర చిత్ర కథ అసోసియేషన్ తో ఈ పుస్తకాన్ని ముద్రించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో ప్రతాప్ రెడ్డి జన్మ  వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.