![]() |
![]() |

హనుమంతుడి శక్తీ ఎంతో చెప్పమంటే చెప్పడం ఎంత కష్టమో.. హిమాలయ శిఖరాల ఎండింగ్ ని చెప్పమంటే ఎంత కష్టమో..ఇప్పుడు హనుమాన్ (hanuman) మూవీ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో చెప్పడం కూడా అంతే కష్టంగా మారింది.రిలీజ్ అయిన రోజు నుంచి ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న హనుమాన్ తాజాగా మరో నయా రికార్డు ని సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా నిలిచింది.
హనుమాన్ తాజాగా 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 25 రోజుల్లో 300 కోట్లు సాధించి మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా ముందుకెళ్తుంది. ఎటువంటి బిగ్ స్టార్స్ లేకుండా ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ప్రేక్షకులని, సినిమాని ఆ హనుమంతుడ్ని నమ్ముకొని వచ్చిన హనుమాన్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న క్రౌడ్ చూస్తుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు వచ్చిన హనుమాన్ ఘన విజయాన్ని సాదించడానికీ ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma) అని చెప్పవచ్చు. హనుమాన్ ని చూస్తున్న ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్ నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు. హీరోగా చేసిన తేజ సజ్జ (teja sajja) హీరోయిన్ గా చేసిన అమృత అయ్యర్ తో పాటు తేజ కి అక్కగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్,విలన్ గా చేసిన వినయ్ రాయ్ ల నటన కూడా చాలా కొత్తగా ఉండి ప్రేక్షకులని కట్టిపడేసింది.

ఇలా హనుమాన్ ఘన విజయంలో అందరు తమ వంతు పాత్ర పోషించారు.విభీషణుడు గా చేసిన సముద్ర ఖని కూడా మూవీ ఘన విజయంలో ఒక భాగమయ్యాడు. త్రేతాయుగంలో వెనకుండి తన గురువు అయిన శ్రీ రామ చంద్రుడు ని గెలిపించిన హనుమంతుడు ఇప్పుడు హనుమాన్ మూవీ కి బ్యాక్ బోన్ గా ఉండి సినిమాని గెలిపించాడు. అలాగే హనుమాన్ కలెక్షన్స్ ఇంతటితో ఆగవనే వాస్తవాన్ని కూడా ప్రపంచం ముందు ఉంచాడు.
![]() |
![]() |