![]() |
![]() |

ప్రేమమ్.. ఈ మూడక్షరాల మలయాళ సినిమా 2015 లో మలయాళం తో పాటు తమిళంలో కూడా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. చెన్నై నగరంలోని ఎన్నో సెంటర్లలో 200 రోజులు జరుపుకుందంటే ప్రేమమ్ తాలూకు ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతలా ఉందో అర్ధం అవుతుంది.అలాగే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఎక్స్పైరీ డేట్ ఉండదని కూడా మరో సారి అర్ధం అయ్యింది.
ప్రేమమ్ కొన్ని రోజుల క్రితం అంటే పిబ్రవరి 1 న తమిళనాడు, కేరళలలో రీరిలీజ్ అయ్యింది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే రెండు కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.ఇటు తమిళంలో గాని అటు మలయాళంలో గాని రీ రిలీజ్ లో ఎక్కువ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా కూడా ప్రేమమ్ నిలిచింది. చెన్నై నగరంలోని చాలా థియేటర్స్ లో ఇప్పటికీ టికెట్స్ దొరకడం లేదంటే ప్రేమమ్ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.ఇక ప్రేమమ్ రీ రిలీజ్ అవ్వటం ఇది మూడో సారి. 2016 ,2017 లో రీ రిలీజ్ అయిన ప్రేమమ్ మళ్ళీ ఆరు సంవత్సరాలకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రేమ చాలా గొప్పదని అది ఎప్పుడు ప్రేమించిన వారి సుఖాన్ని కోరుకుంటుందని, అలాగే తొలిసారి పుట్టిన ప్రేమ ఎంత వయసొచ్చినా కూడా పోదు అనే పాయింట్ తో ప్రేమమ్ రూపొందింది. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమమ్ లో సాయి పల్లవి నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్ గా నటించింది. ఈ మూవీ ద్వారానే ఇద్దరు సినిమా రంగానికి పరిచయమయ్యారు.నివిన్ పౌలీ హీరోగా నటించిన ఈ మూవీని ఆల్ఫోన్సో పుత్రేన్ దర్శకత్వం వహించాడు.కేవలం 4 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 75 కోట్లకి పైగా వసూలు చేసి ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ప్రేమమ్ తెలుగులో కూడా నాగ చైతన్య హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది.
![]() |
![]() |