![]() |
![]() |
.webp)
ఆసేతు హిమాచలం సాక్షిగా హనుమాన్ సాధించిన ఘన విజయం నభూతో నభవిష్యత్తు అనే రీతిన ఇంకా కొనసాగుతూనే ఉంది. మూవీ వచ్చి 20 రోజుల పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ చాలా ఏరియాల్లో ఆడియన్స్ క్రౌడ్ అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. రిపీట్ ఆడియెన్స్ కూడా ఉండటం హనుమాన్ గొప్ప తనాన్ని చాటి చెప్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద హాట్ టాపిక్ గా నిలిచింది.
హనుమాన్ మూవీలో హీరో ఎవరని అడిగితే చిన్న పిల్లలు సైతం వెంటనే తేజ అని చెప్తారు.అంతలా తేజ హనుమన్ లోని తన క్యారక్టర్ ద్వారా ఇండియా వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బోలెడంత మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఈ అభిమానాన్ని పొందటం కోసం కోసం హనుమాన్ లోని తన క్యారక్టర్ కోసం తేజ రెండున్నరయేళ్లు కష్ట పడ్డాడు.ఈ సమయంలో ఏకంగా 75 సినిమాలకి పైనే వదులుకున్నాడు.అవును హనుమాన్ లో ఎలాగైనా నటించాలని చెప్పి సుమారు 75 సినిమాకి పైనే తేజ వదులుకున్నాడు. ఈ విషయాన్ని తేజనే స్వయంగా చెప్పాడు.
సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమా కోసం రెండు మూడు లుక్ టెస్ట్ లు మాత్రమే ఇస్తాడు. కానీ తేజ మాత్రం హనుమాన్ కి 25 లుక్ టెస్ట్ లు ఇచ్చాడు. దీన్ని బట్టి హనుమాన్ మీద తేజ ఎంత శ్రద్ద వహించాడో అర్ధం అవుతుంది. సినిమాలో వచ్చే ఫైటింగ్ సీన్స్ లో ఎలాంటి డూప్ లేకుండా నటించాడు. బాడీ షేమింగ్ గాని గ్రాఫిక్స్ గాని చెయ్యలేదు. అలాగే నీటి లోపల వచ్చే సీన్స్ అన్నింటిని కూడా స్కూబా డ్రైవింగ్ నేర్చుకొని మరి చేసాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలని తెలుసుకున్న చాలా మంది తేజ సజ్జ కి సినిమా మీద ఉన్న కమిట్ మెంట్ ని తెలుపుతుందని అంటున్నారు. ప్రస్తుతం తేజ సజ్జ అమెరికా లో మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, అమృత అయ్యర్ లు కూడా అక్కడే ఉన్నారు. ఇక హనుమాన్ ప్రస్తుతానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ తో ముందుకు దూసుకుపోతుంది
![]() |
![]() |