![]() |
![]() |

అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) నుంచి తాజాగా వస్తున్న చిత్రం ఈగిల్(eigle)రవితేజ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అనుపమ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ ని పోషిస్తుంది. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతు వస్తున్నాయి. అందులో భాగంగా నిన్న ఈగిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రవితేజ అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.
రవితేజ అనుపమ లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో ఈగిల్ చిత్ర దర్శకుడు అయిన కార్తీక్ ఘట్టమనేని ని అనుపమ అన్నయ్య అని పిలిచింది. దాంతో రవితేజ అనుపమతో అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలవకూడదని అన్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుపమ పరమేశ్వర్ స్టేజి పైకి వస్తున్నప్పుడు ఆ వీడియోని ప్లే చేసారు. దాంతో అనుపమ రవితేజ తో కార్తీక్ నేను కలిసి ఆరు సినిమాల దాకా వర్క్ చేసాము. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా నేను అన్నయ్య అనే పిలుస్తాను అని చెప్పింది. ఆ తర్వాత యాంకర్ సుమ ఒక రాఖీని తెప్పించి అనుపమ చేత కార్తీక్ కి కట్టించింది. ఇప్పుడు ఇదంతా వైరల్ గా మారింది.
.webp)
2016 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత ప్రేమమ్, తేజ్ఐ లవ్ యు, రాక్షసుడు, హలో గురు ప్రేమ కోసమే, కార్తికేయ 2 లతో మంచి నటిగా గుర్తింపుని పొందింది.తను ప్రస్తుతం ఈగిల్ తో పాటు టిల్లు స్క్వార్ చిత్రంలోను నటిస్తుంది. ఈగిల్ ఫిబ్రవరి 9 న విడుదల అవుతుంది.
![]() |
![]() |