![]() |
![]() |

ఘట్టమనేని సితార.. ఒక సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగా ఇప్పుడు సితార అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్. ఇనిస్టాగ్రామ్ లో తనకి రెండు మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారనే అంకెలే అందుకు ఉదాహరణ. అలాగే తను షేర్ చేసే డాన్సింగ్ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా తాను చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు రికార్డు సృష్టిస్తుంది.
సితార ఇటీవల తన తండ్రి మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ కి డాన్స్ వేసింది. నిజం చెప్పాలంటే ఆ పాటకి డాన్స్ చేసిన మహేష్,శ్రీలీల కంటే సితారనే బాగా డాన్స్ చేసింది. చాలా అందంగా ఉన్న సితార ఆ వీడియోని తన ఇనిస్టాలో పోస్ట్ చేసిన కాసేపటికే 50 లక్షల వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. పైగా ఆ డాన్స్ వీడియో చూసిన వాళ్ళందరు ఫ్యూచర్ లో తెలుగు తెర మీద సితార డాన్స్ ని అందుకోవడం ఎవరికైనా చాలా కష్టమని అంటున్నారు. ఇంకొంత మంది గుంటూరు కారంలోని మహేష్ ఫేమస్ డైలాగ్ ని లింక్ చేస్తు సితార డాన్స్ త్రీడీలో కనిపిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంత మంది ఊర మాస్ డాన్స్ అంటున్నారు
ఇక సితార సినిమాల్లోకి వస్తుందని నమ్రత ఇది వరకే చెప్పింది. ప్రస్తుతం తను క్లాసికల్ డాన్స్ లో కూడా తర్ఫీదు పొందుతుంది. అలాగే తన తండ్రి మహేష్ లాగానే పలువురికి తన చేతనైన సాయం చేస్తు తనకున్న మంచి హృదయాన్ని చాటుతుంది. చాలా సందర్భాల్లో పలు చారిటి సంస్థల్ని కూడా సందర్శించింది. మహేష్ ఫ్యాన్స్ కి సితార అనే చాలా అభిమానం.
![]() |
![]() |