![]() |
![]() |

2001 లో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు ముప్పైకి పైగా సినిమాల్లో నటించిన నటి కరాటే కళ్యాణి. ఆమె చేసిన కొన్ని క్యారక్టర్లని చూస్తుంటే అసలు ఆ పాత్రలు పుట్టింది ఆమె కోసమే అనిపిస్తుంది.అంతలా తన క్యారెక్టర్స్ లో లీనమయ్యి నటిస్తుంది.ఆమె గత కొంత కాలం నుంచి సమాజంలో జరిగే పలు విషయాలపై నిర్మోహ మాటంగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తుంది. దాంతో ప్రేక్షకుల దృష్టిలో ఆమెకి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. తాజాగా మరోసారి తన ఫైర్ బ్రాండ్ పేరుని ఆమె సార్ధకం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలుగు సినిమా కళాకారులకి ఇచ్చే నంది అవార్డుల స్థానంలో నంది పేరుని మార్చి గద్దర్ అవార్డులని ఇస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై కరాటే కళ్యాణి తన దైన రీతిలో స్పందించింది. గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇవ్వాలనుకోవడం అనేది మీ ఇష్టం. కానీ అత్యున్నతమైన నంది అవార్డుల పేరు మార్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ పని ఏ ముఖ్యమంతి చేసినా కూడా తప్పే అవుతుంది. తనకి జరిగిన అన్యాయాన్ని నంది చూసుకుంటాడులే అనే అనే కీలక వ్యాఖ్యలు ని ఆమె చేసింది. అలాగే గాడ్సే పేరుపై నేను అవార్డులు ఇద్దామనుకుంటున్నాను దేశభక్తి, దైవభక్తి ఉన్నవాళ్లే ఇందుకు అర్హులు అవార్డు కావలసిన వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోండి అనే సంచలన వ్యాఖ్యలని కూడా ఆమె చేసింది .

అలాగే 2014లో నాకు ప్రకటించిన నంది అవార్డులు ఇంకా ఇవ్వలేదు అవి ఇంక రావని కూడా తెలుసు. కళాకారులకి గద్దర్ పేరున ఇచ్చే అవార్డులు కూడా దండగే అని కూడా ఆమె అంది. ఆమె తన ఫేస్ బుక్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ విషయంలో కల్యాణిని కొంత మంది విమర్శిస్తుంటే మరికొంత మంది మాత్రం సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.
![]() |
![]() |