![]() |
![]() |
.webp)
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో నటించబోతున్నాడు.భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎక్కడా రాని ఒక డిఫరెంట్ పాయింట్ తో ఆ మూవీ తెరకెక్కబోతుంది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇప్పుడు ఈ మూవీలో నటించే అవకాశాన్ని చిత్ర యూనిట్ మరింత మందికి కల్పించనుంది. అందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఫిబ్రవరి 5 వ తేదీ నుండి 17 వరకు ఆడిషన్స్ ను నిర్వహించనున్నారు.వయసుతో సంబంధం లేకుండా మేల్ అండ్ ఫిమేల్ ఈ ఆడిషన్ లో పాల్గొనవచ్చు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ వార్తలతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. అలాగే ఆడిషన్ లో పాల్గొనడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మిగతా ఆర్టిస్టులకి సంబంధించిన వివరాలు మరిన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.గతంలో రామ్ చరణ్ మైత్రి కాంబోలో వచ్చిన రంగ స్థలం చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ పై చెర్రీ అభిమానులతో పాటు ప్రేక్షకులల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |