![]() |
![]() |

మెగా హీరోలందరిది ఒక దారి అయితే ఆ కోటరీలో ఒకడైన వరుణ్ తేజ్ ది మరోదారి.హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్లడం వరుణ్ నైజం. తను చేసే ఒక చిత్రానికి ఇంకో చిత్రానికి అస్సలు సంబంధం ఉండదు. తాజాగా ఆయన సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక విషయం బయటకి వచ్చింది.
వరుణ్ తేజ్ తాజాగా చేస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఫిబ్రవరి 9 న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ వాయిదాపడిందనే విషయం అందరికి తెలిసిందే. మూవీలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయి.వాటికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఈ కారణం చేతనే మూవీ వాయిదా పడింది.దీంతో మెగా హీరో ఎందుకు వెనక్కి వెళ్ళాడో అనే విషయం మీద అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి మూడో వారంలో గాని మర్చి మొదటి వారంలో గాని మూవీ విడుదల అవుతుందని అంటున్నారు.ఇందుకు సంబంధించిన రిలీజ్ తేదీని కూడా మేకర్స్ త్వరలోనే వెల్లడి చెయ్యనున్నారు.
వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ కి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడుగా వ్యవహరించాడు. సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని లు అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు.కొన్ని రోజుల క్రితం వచ్చిన టీజర్ తో ఆపరేషన్ వాలెంటైన్ పై అందరిలోనూ భారీ అంచనాలైతే ఉన్నాయి.
![]() |
![]() |