![]() |
![]() |

ఇటీవల కాలంలో పలు తెలుగు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలో మరో తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అదే 'ఎల్ఎస్‌డి'(LSD).
శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సీరీస్ 'ఎల్ఎస్‌డి'. అనిల్ మోదుగతో కలిసి శివ కోననే ఈ సిరీస్ ని నిర్మించడం విశేషం. ప్రాచీ టక్కర్, నేహా దేశ్ పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించిన ఈ సీరీస్ కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందించారు. అలాగే పవన్ గుంటుకు, హర్ష ఈడిగా సినిమాటోగ్రఫర్స్ గా వర్క్ చేశారు.
తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 2న ఎమ్ఎక్స్ ప్లేయర్ లో విడుదల కానున్న ఈ వెబ్ సీరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు బోల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ తో ఈ సీరీస్ రాబోతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఎల్ఎస్‌డి వెబ్ సీరీస్ లో మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, వారి ఫారెస్ట్ ట్రిప్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయట. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ దర్శకుడు శివ కోన ఈ సీరీస్ ను అద్భుతంగా రూపొందించాడని టీం చెబుతోంది.
![]() |
![]() |