![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi)కి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ ని ప్రకటించి గౌరవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో మంది సినీ రాజకీయ వ్యాపార వర్గాల వారు చిరుని కలిసి తమ అభినందనలు తెలియచేసారు. అలాగే మరికొన్నిరోజుల్లో చిరంజీవి పద్మవిభూషణ్ ని అందుకోనున్నారు. తాజాగా చిరంజీవి ఇద్దర్ని సన్మానించడం ఆయన గొప్పతనాన్ని తెలియచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో పద్మశ్రీ అవార్డు కూడా ఒకటి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ యక్ష గాన కళాకారుడు సమ్మయ్య(sammayya)తో పాటు శిల్ప కలలో ఎంతో ప్రావిణ్యం సంపాదించిన ఆనంద చారి(ananda chari)లకి పద్మశ్రీ లు దక్కాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి వాళ్ళిద్దరిని తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియడంతో చిరంజీవి గొప్ప తనాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. తనకి అవార్డు వచ్చినందుకు అందరు చిరుని సన్మానిస్తుంటే ఆయన మాత్రం పద్మశ్రీ వచ్చిన వాళ్ళని సన్మానించడం చాలా గ్రేట్ అని కూడా అంటున్నారు. అలాగే చిరంజీవి గారు అంతటి మంచి మనసున్న మనిషి కాబట్టే ఆయనకి పద్మ విభూషణ్ వచ్చిందని కూడా అంటున్నారు
ఆ ఇద్దర్ని సన్మానించిన అనంతరం చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. సమ్మయ్య గారు ఆనందచారి లు అధ్బుతమైన కళాకారులని ఇద్దరు కూడా తమ తమ రంగాల్లో విశిష్టమైన సేవలు అందించి తెలుగు వారి కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారని కొనియాడారు. అలాగే ఇటువంటి కళాకారులని గుర్తించి పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. పద్మవిభూషణ్ అందుకొని ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి తమని ఇంటికి పిలిపించుకొని సన్మానించడాన్ని తమ జీవితంలో మరిచిపోలేమని సమ్మయ్య, ఆనందచారి లు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
![]() |
![]() |