![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఆడియన్స్ కి ప్రతీ వారం నవ్వుల నజరానాను అందిస్తున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బిగ్ స్క్రీన్ కి వెళ్లారు. మంచి మంచి అవకాశాలను సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో కమెడియన్ తాగుబోతు పేరడీలు కట్టే రాజమౌళి ఒకరు. ఆయన కామెడీ చేయక్కర్లేదు ఎందుకంటే ఆయన ఆహార్యమే నవ్వు తెప్పించేస్తుంది. ఇన్నోసెంట్ ఫేస్ తో తడబడే తెలుగుతో స్క్రీన్ మీద ఒక్కసారి కనిపిస్తే చాలు పడీ పడీ నవ్వేసుకునేంత కామెడీ ఆ ముఖంలో తాండవిస్తూ ఉంటుంది. ఇక ఆయన మందు మీద, మందు బాబుల మీద పేరడీ కట్టి గారడీ చేస్తే ఇక ఆడియన్స్ కి పొట్ట చెక్కలవ్వాల్సిందే...అలాంటి రాజమౌళి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.
"నేను నాలుగు నెలల నుంచి జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఎందుకంటే నాకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. నేను జబర్దస్త్ నుంచి బ్రేక్ తీసుకోలేదు... నాకు కొంచెం ఫ్రీనెస్ ఇచ్చి జబర్దస్త్ లోకి పిలిస్తే వెళ్తాను. ఎవరికైనా సిల్వర్ స్క్రీన్ మీద నటించాలని ఉంటుంది కదా. ఇప్పటికే నేను తాతా-మనవడు, కాలగమనం, జయహో జనార్దనా, వృషభ ఇలా చాలా మూవీస్ లో ఫుల్ లెన్త్ రోల్ తో పాటు కామెడీ సెన్స్ రోల్స్ కూడా చేసాను. కరోనా టైంలో చాలా సివియర్ అయ్యింది నాకు.. చచ్చి మళ్ళీ బతికాను...నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భోలే షావలి.. మొదట్లో హీరోస్ అనే మూవీలో నేను గెటప్ శీను నటించాం. జబర్దస్త్ లో నాకు బలగం వేణు అన్న 2014 లో అవకాశం ఇచ్చాడు. కొంతమందికి దూసుకెళ్లే స్వభావం ఉంటుంది..కానీ నాకు అది లేదు..అందుకే అవకాశాలు అంతగా రావు...ఐనా కూడా నాగబాబు గారి దగ్గరకు వెళ్తే కాదనరు..కానీ నేను వెళ్ళను..చిరంజీవి గారితో భోళా శంకర్ మూవీలో నటించారు. ఆయనే పిలిచి మరీ అవకాశం ఇప్పించారు." అంటూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |