![]() |
![]() |
తెలుగులో మరో అర్జున్‌రెడ్డి వచ్చేస్తోంది. ఆడియన్స్‌ని మరింత టెన్షన్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే సిద్ధార్థ్ రాయ్. ఇది అర్జున్‌రెడ్డిని మించిన సినిమాలా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసుకోవచ్చు. అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. ఈ సినిమా యూనిట్‌లోని వారంతా కొత్తవారే. అయినా సినిమాపై అందరి దృష్టీ పడిరది. దానికి కారణం ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలరే కారణం. వీటిన్నింటిని మించి సుకుమార్ ఈ సినిమాను సపోర్ట్ చేయడం కూడా ఒక కారణం.
సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా ఒకటి ఉందని, అది అర్జున్‌రెడ్డిలాంటి సినిమా అనీ ప్రేక్షకులకు తెలిసింది మాత్రం సుకుమార్ వల్లే. ఈ సినిమా గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అలాంటి సమయంలో ఆ చిత్ర దర్శకుడు యశస్వీ ట్రైలర్‌ను సుకుమార్‌కి పంపాడు. అది చూసిన సుకుమార్ ఎంతో ఇంప్రెస్ అయి యశస్వికి మెసేజ్ చేశాడు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని కూడా సుకుమార్‌కి పంపడం, అది చూసి మరింత ఇంప్రెస్ అయి తన సొంత బేనర్ అయిన సుకుమార్ రైటింగ్స్‌లో సినిమా చేయమని ఆఫర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో ‘సిద్ధార్థ్ రాయ్’ సుకుమార్ సినిమా అనే లుక్ వచ్చేసింది. ‘సిద్ధార్థ్ రాయ్’ దర్శకుడి నెక్స్‌ట్ సినిమా సుకుమార్ బేనర్‌లో అనే విషయం జనంలోకి బాగా వెళ్ళడంతో సినిమాకి మంచి పబ్లిసిటీ లభిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సైతం సుకుమార్ ప్రస్తావనే తీసుకొచ్చారు. తమ సినిమా సుకుమార్‌కి నచ్చిందని, తమ దర్శకుడికి ‘సిద్ధార్థ్ రాయ్’ వల్లే మరో సినిమా ఛాన్స్ వచ్చిందని.. ఇలా తమ మాటల్లో చెప్పారు. ఈ సినిమాకి సుకుమార్ పేరు బాగా ఉపయోగపడుతోంది. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ప్రేక్షకులు మంచి ఓపెనింగ్సే ఇచ్చేలా ఉన్నారు.
![]() |
![]() |