![]() |
![]() |

సినిమా పేరు: నెరు
నటీనటులు: మోహన్ లాల్, నందు, అనస్వర రాజన్, దినేష్ ప్రభాకర్, ప్రియమణి, కృష్ణ ప్రభ, సిద్దిఖ్, జగదీష్, శంకర్, ఇందు చూడన్ తదితరులు
సంగీతం: విష్ణు శ్యామ్
సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్
రచన : శాంతి మాయాదేవీ, జీతూ జోసెఫ్
ఎడిటింగ్: వి.ఎస్. వినాయక్
నిర్మాత: ఆంటోని పెరంబూర్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మోహన్ లాల్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా 'నెరు' తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
సారా మహమ్మద్ (అనస్వర రాజన్) అనే అంధురాలిపై ఓ ఆగంతకుడు అత్యాచారానికి పాల్పడతాడు. అతను ముంబైకి చెందిన ఓ పెద్ద వ్యాపారావేత్త కొడుకు. అయితే సారా వ్యక్తుల మొహాలని తాకి ఆ స్పర్శ ఆధారంగా అతడి శిల్పాన్ని తయారుచేస్తుంది. అలాగే తనపై అత్యాచారానికి పాల్పడిన మైఖేల్ జోసెఫ్(శంకర్ ఇందుచూడన్) విగ్రహాన్ని తయారు చేస్తుంది. ఇక పోలీసులు ఆ నిందితుడిని తీసుకొచ్చి సారా ముందు ఉంచగా.. అతనే అని కన్ఫమ్ చేస్తుంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత కోర్ట్ లో ఫేమస్ క్రిమినల్ లాయర్ రాజశేఖర్(సిద్ధిఖ్) మైఖేల్ తరుపున వాదిస్తుంటాడు. అతను ఎంతటి కేసునైనా తనవైపు లాక్కునేలా వాదించే దిట్ట. మొదటి వాదనలోనే రాజశేఖర్ ధాటికి డిఫెన్స్ చేయలేకపోతాడు అపోజిట్ లాయర్. దాంతో కోర్ట్ మైఖేల్ కి బెయిల్ మంజూరు చేస్తుంది. ఆ తర్వాత సారాకి మైఖేల్ తరుపున సెటిల్మెంట్ ఆఫర్ వస్తుంది. దానికి విరుద్ధంగా సారా న్యాయం కోసం పోరాడతానని చెప్తుంది. ఇక సారా కేసు ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసు అధికారి సూచన మేరకు సారా ఫ్యామిలీ లాయర్ విజయ్ మోహన్(మోహన్ లాల్) ని ఆశ్రయిస్తారు. సారాని అత్యాచారం చేసిందెవరు? లాయర్ మోహన్ కేసుని గెలిచాడా? లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో ఇప్పటికే 'దృశ్యం' మూవీ వచ్చేసింది. ఇక అది ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో ఇప్పుడు నెరు వచ్చింది. ఇందులో ఓ అంధురాలి కేసుని తీసుకొని దానిని వాదించడం, ఓ పెను సవాలుగా మారిన తరుణంలో లాయర్లంతా తప్పుకుంటే లాయర్ విజయ్ మోహన్(మోహన్ లాల్) ఎలా సాల్వ్ చేశాడనేది చూపించడంలో జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యారు.
ప్రథమార్ధంలో సారాకు వ్యతిరేకంగా కోర్ట్ రూమ్ డ్రామా సాగుతుంది. అదంతా చాలా వరకు స్లోగా ఉంటుంది. కాస్త స్కిప్ చేయక తప్పదు అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ముందు లాయర్ విజయ్ మోహన్ ని కలవడం.. అతను ఈ కేసుని వాదించడానికి ఒప్పుకోవడం అన్నీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అడల్డ్ సీన్స్ ఏమీ లేవు. ఒక్క అత్యాచారం చేస్తున్నప్పుడు చూపించే ఓ పదిహేను సెకన్ల వీడియో తప్ప అశ్లీల దృశ్యాలేవీ లేవు. అసభ్య పదజాలం కూడా ఎక్కడా వాడలేదు. చివరి వరకు ఓ ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చూస్తూ క్లైమాక్స్ లో రివీల్ చేసే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి.
క్రిమినల్ లాయర్ రాజశేఖర్ వర్సెస్ లాయర్ విజయ్ మోహన్ ల మధ్య సాగే వాదోపవాదాలు సినిమాని ఆసక్తిగా మలిచాయి. ఇక ఒక్కో హియరింగ్ లో విజయ్ మోహన్ సాక్షులని అడిగే ప్రశ్నలతో రాజశేఖర్ కంగుతింటాడు. ఇదంతా సినిమాని చివరివరకు చూసేలా చేశాయి. కథలోని పాత్రలని సహజసిద్ధంగా మలచడంలో జీతు జోసెఫ్ సక్సెస్ అయ్యారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. శాంతి మాయాదేవి రచన జీతు జోసెఫ్ కు ప్లస్ అయింది. విష్ణు శ్యామ్ అందించిన బిజిఎమ్ కోర్టులో కొన్ని సీన్లని ఎలవేట్ చేసేలా చక్కగా కుదిరింది. వి.ఎస్. వినాయక్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్ లో కొన్ని స్లో సీన్లని తీసేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
విజయ్ మోహన్ గా మోహన్ లాల్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. లాయర్ రాజశేఖర్ గా సిద్ధిఖ్ ఆకట్టుకున్నాడు. పూర్ణిమ రాజశేఖర్ గా ప్రియమణి ఉన్నంతలో బాగా నటించింది. అంధురాలిగా సారా పాత్రలో అనస్వర రాజన్ సహజసిద్ధంగా నటించింది. ఇక మిగతా వారు వారు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
న్యాయం కోసం ఎంతగానో ప్రయత్నం చేసే ఓ అంధురాలి కథని తెరకెక్కించిన విధానం బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఓ కోర్ట్ రూమ్ డ్రామా ఇది.
రేటింగ్: 2.75/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |