![]() |
![]() |
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతోంది అనగానే రోజుకో అప్‌డేట్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని అప్‌డేట్స్ ప్రచారంలో ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా సినిమా అని, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘సినిమాకి కథ ఇవ్వడంతో మా పని పూర్తయిపోతుంది. ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లిపోతారు. అప్పటి నుంచి టీమ్‌తో మాకు ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండదు. స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడైనా డౌట్ వస్తే మమ్మల్ని పిలుస్తారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఇది ఇండియానా జోన్స్ తరహా సినిమాయే. అయితే ఒక్కో డైరెక్టర్ టేకింగ్ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఇది రాజమౌళి మార్క్‌లో ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి’ అని వివరించారు విజయేంద్రప్రసాద్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోపక్క ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా చర్చ నడుస్తోంది. భారత దేశ చలన చిత్ర చరిత్రలోనే మొదటిసారి రూ.1000 కోట్లతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుందని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందన్న వార్త బయటికి రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. ఈ సినిమాతో మహేష్ ప్యాన్ వరల్డ్ హీరోగా పేరు తెచ్చుకుంటారని వారు ఆశిస్తున్నారు.
![]() |
![]() |