![]() |
![]() |

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అప్ డేట్ అవ్వక ముందే ఆయన నిర్మాతగా అప్ డేట్ అయ్యాడు.ఆయన నుండి వచ్చిన పెద్దరికం,భారతీయుడు, ఖుషి, రన్,బాయ్స్, 7 / g బృందావన కాలనీ లాంటి అప్ డేట్ సినిమాలే అందుకు ఉదాహరణ. ఆయన ఎవరో కాదు శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ. ఎం. రత్నం( A. M. Ratnam) ఆయన తాజాగా సినిమా పరిశ్రమకి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎ. ఎం. రత్నం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఆయనకి సన్మానం జరిగింది. నెల్లూరు జిల్లాకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కళాకారులు ఆయనకి ఘన సన్మానం చేసి చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న గొప్పతనాన్ని కొనియాడారు. అనంతరం ఎ. ఎం. రత్నం మాట్లాడుతూ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలో జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని మున్ముందు చిత్ర పరిశ్రమలో ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి కృషి చేస్తానని కూడా ఆయన తెలిపారు
కాగా ఎ. ఎం. రత్నం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)కి చాలా కావలసిన మనిషి. పవన్ తో ఖుషి, బంగారం వంటి సినిమాలని ఆయన నిర్మించాడు. ప్రస్తుతం ఆయన పవన్ తోనే హరి హర వీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉండటం ఈ క్రమంలో పవన్ సన్నిహితుడైన ఎ. ఎం. రత్నం ఏపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా ఎన్నిక కావటం ఆయన ఏపిలో సినిమా పరిశ్రమని బలోపేతం చేస్తాననడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
![]() |
![]() |