![]() |
![]() |

బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సూపర్ హీరో ఫిల్మ్.. స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. పదో రోజు కూడా మొదటి రోజు స్థాయిలో వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు పది రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ క్లబ్, రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇప్పటిదాకా కొందరు బడా స్టార్లే ఈ ఫీట్ సాధించలేకపోవడం విశేషం.
పది రోజుల్లో నైజాంలో రూ.26.56 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.7.37 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.25.58 కోట్ల షేర్ రాబట్టిన హనుమాన్.. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రూ.59.51 కోట్ల షేర్(రూ.98.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.26.60 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.21.80 కోట్ల షేర్ తో.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.107.91 కోట్ల షేర్(రూ.201.35 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. రూ.29 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హనుమాన్.. ఇప్పటికే రూ.78 కోట్ల లాభాలను చూసింది. ఫుల్ రన్ ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశముంది. అదే జరిగితే బయ్యర్లు ఏకంగా రూ.100 కోట్ల లాభాలను చూసే ఛాన్స్ ఉంది.
'హనుమాన్' 10 రోజులు వసూళ్లు:
నైజాం: రూ.26.56 కోట్ల షేర్
సీడెడ్: రూ.7.37 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.25.58 కోట్ల షేర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వసూళ్లు: రూ.59.51 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.26.60 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.21.80 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా పది రోజుల వసూళ్లు: రూ.107.91 కోట్ల షేర్

![]() |
![]() |