![]() |
![]() |

హనుమాన్ మూవీ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని పిల్లలని, పెద్దలను అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో జమ చేసుకుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన ప్రశంసల వర్షం కురిపించేసాడు. లోబడ్జెట్ తో ఇంత అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ని యూజ్ చేసి ఇలాంటి మూవీస్ ని కూడా తీయొచ్చా అని ప్రశాంత్ వర్మ నిరూపించి చూపించాడంటూ ఆకాశానికెత్తేశారు. ఈ వీడియో ఆర్జీవీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇటువంటి గ్రాఫిక్స్ ఉన్న మూవీస్ ని తీయాలంటే వందల కోట్లు కావాలని భావించే వారికి చెంపదెబ్బలా హనుమాన్ మూవీని డైరెక్ట్ చేశాడంటూ కొనియాడాడు.
తన సత్తాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రశాంత్ గొప్ప పాఠాన్ని నేర్పించాడని వర్మ అభినంచాడు. లో బడ్జెట్లో ఇలాంటి మూవీ తీయాలంటే తెలివి, పట్టుదల, శ్రమ ఉంటే చాలని నిరూపించాడన్నారు. హనుమాన్ సక్సెస్ ఐనందుకు అలాగే ఇండస్ట్రీకి తన స్టయిల్లో ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్స్ కి మంచి పాఠాన్ని నేర్పినందుకు ప్రశాంత్ ను పొగిడేసాడు. ఇక ఆర్జీవీ కామెంట్స్ కి నెటిజన్స్ రిప్లైస్ ఇస్తున్నారు. "సార్ మారిపోయాడు మంచి సినిమాలకు రివ్యూలు ఇస్తున్నందుకు చాలా థాంక్స్ సార్ ...సర్ మీరు చాలా మారిపోయారు...ఫస్ట్ టైం జెన్యూన్ రివ్యూ ఇచ్చారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి అంతకుమించి అన్నట్టుగా ఉన్న భారీ బడ్జెట్ మూవీస్ తో ఈక్వల్ గా హనుమాన్ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హనుమాన్ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఫిదా ఇపోయారంటే ప్రశాంత్ పనితనం ఏ రేంజ్ లో ఈపాటికి అందరికీ అర్దమైపోయే ఉంటుంది. సంక్రాంతి బరిలో నిలిచిన 'హనుమాన్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు రాఘవేంద్రరావు. తేజ సజ్జా నటనతో పాటు , ప్రశాంత్ వర్మ డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.
![]() |
![]() |