![]() |
![]() |

ప్రముఖ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
సినీ పరిశ్రమలో మంచు లక్ష్మికి ఎందరో స్నేహితులు ఉన్నారు. పలువురు హీరో హీరోయిన్లతో ఆమె మంచి అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ లిస్టులో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కూడా ఉంటారు. రకుల్, ప్రగ్యాతో కలిసి దిగిన ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది మంచు లక్ష్మి. అందులో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా మంచు లక్ష్మి గ్లామర్ డోస్ పెంచింది. ముఖ్యంగా ముంబైకి మకాం మార్చినప్పటి నుంచి అందాలు ఆరబోస్తూ ఫొటోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

![]() |
![]() |