![]() |
![]() |

గుంటూరు కారానికి ఎంత ఘాటు ఉంటుందో మహేష్ నటనకి అంతే ఘాటు ఉంటుంది. ఇంకెంత మహా అయితే రెండు రోజులు కేవలం రెండంటే రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు మహేష్ సునామితో ఉగిపోనున్నాయి. అల్ రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ తో, మూడు సాంగ్స్ తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి ఇప్పుడు పూనకాలు తెప్పించే రేంజ్ లో నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది.
గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్ లు రిలీజ్ అయ్యాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు తాజాగా మావ ఎంతైనా పర్లేదు బిల్లు మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. లిరికల్ వీడియో తో రిలీజ్ అయిన ఆ సాంగ్ ని చూస్తుంటే మహేష్ నటనకి సంబంధించి ఇంతవరకు ఎవరు చూడని ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నామని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. అలాగే ఆ సాంగ్ కథలో చాలా కీలకమని కూడా తెలుస్తుంది.

సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో వచ్చిన ఆ పాటలోని లిరిక్స్ మొత్తం ప్రతి ఒక్కరు పాడుకునేలా చాలా క్యాచీగా ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి తన గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న బాధని బయటకి చెప్పినట్టుగా ఉంది. శ్రీ కృష్ణ, రామాచారి లు ఆలపించిన ఈ సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్ లో ఉండటంతో పాటు లైక్స్ ని కూడా భారీ స్థాయిలో సాధిస్తుంది.ఇప్పుడు ఈ సాంగ్ తో మహేష్ అభిమానుల హంగామా మాములుగా లేదు. అలాగే థమన్ సూపర్ గా ట్యూన్ ని అందించాడని కూడా అంటున్నారు.
![]() |
![]() |