![]() |
![]() |

నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అగ్ర నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. పరమేశ్వర ఆర్ట్స్ పై ఆయన నిర్మించిన చాలా చిత్రాలు ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచాయి. తాజాగా ఆయన దగ్గర పని చేసే ఒక వ్యక్తికి సంబంధించిన న్యూస్ హల్ చల్ చేస్తుంది.
బండ్ల గణేష్ దగ్గర రమణ అనే అతను చాలా సంవత్సరాల నుంచి కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అతనికి చందన అనే అమ్మాయితో వివాహం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇంద్ర నగర్ వారిలో వారిద్దరు నివాసం ఉంటారు. ఇప్పుడు రమణ ఇంట్లో లేని సమయంలో చందన ఉరి వేసుకొని చనిపోయింది. చందన మృతికి కారణాలు తెలియదు. కానీ చందన, రమణల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుండేవని తెలుస్తుంది.
చందన మృతి చెందిన సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం దర్యాప్తు ని ప్రారంభించారు. చందన బంధువులు మాత్రం తమ అమ్మాయి మృతికి రమణ నే కారణం అని ఆరోపిస్తున్నారు.
![]() |
![]() |