![]() |
![]() |
నటుడుగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఇప్పుడు ‘రంగుల ప్రపంచం’తో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. క్రాంతి హీరోగా, తన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిపింది చిత్ర యూనిట్.
హీరో క్రాంతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పృథ్విరాజ్‌గారికి థాంక్స్’’ అన్నారు. హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ ‘‘మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌గా తెలుసు. నాకు నాన్నగా చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఎంతో ఇష్టమైన పృథ్వీరాజ్‌గారు నన్ను హీరోయిన్‌గా పెట్టి ఈ సినిమా డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
డైరెక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘‘నన్ను ఇన్నాళ్లు ఆర్టిస్ట్‌గా ఎంతో ఆదరించారు ఈ సినిమాతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ముందే చెప్పా కొత్త వాళ్ళు కంప్లీట్‌గా కొత్త హీరో కొత్త హీరోయిన్ కొత్త డైరెక్టర్ ఇలా అందరం కలిపి ఒక మంచి ప్రోడక్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
![]() |
![]() |