![]() |
![]() |

లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ్య ఉతలూరు ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మిస్ పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఉంది. లావణ్య సూట్ కేసుపై కూర్చొని అమాయకంగా చూస్తుండగా.. వెనుక అభిజీత్, అభిజ్ఞ్య నిల్చొని ఉన్నారు. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా లావణ్య స్పందిస్తూ "న్యూ ఇయర్ ను పర్ఫెక్ట్ గా మొదలుపెట్టబోతున్నాం" అంటూ ట్వీట్ చేసింది. కాగా ఇటీవల వరుణ్ తేజ్ తో లావణ్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ "మిస్ పర్ఫెక్ట్ లాంటి ఒక యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పర్చుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా 'మిస్ పర్ఫెక్ట్'ను రూపొందించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సిరీస్ తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.

ఝాన్సీ, హర్షవర్థన్, మహేశ్ విట్ట, హర్ష్ రోషన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా ఆదిత్య జవ్వాది, ఎడిటర్ గా రవితేజ గిరిజాల వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |