![]() |
![]() |

ఆమె కూచిపూడి నృత్య కళాకారిణిగా తెలుగు దేశమంతటా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 200 చిత్రాల దాకా నటించింది. అంతే కాకుండా తన అధ్బుతమైన నటనతో మహానటుడు ఎన్టీఆర్ అంతటి వ్యక్తినే ముప్పతిప్పలు పెట్టింది. ఆవిడ ఎవరో కాదు అలనాటి అందాల నటి ప్రభ. ఆవిడ ఇంట తాజాగా పెళ్లి బాజా మోగడంతో సినీ పరిశ్రమ యావత్తు కదిలివెళ్లడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.
ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడు రాజా రమేష్ వివాహం విజయవాడ కి చెందిన సాయిఅపర్ణతో ఈ రోజు ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో పాటు మురళీమోహన్, సుమన్, సాయికుమార్, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి, వై. విజయ, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను,రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి లు హాజరయ్యి వధూవరులిద్దరిని ఆశీర్వదించారు. అలాగే ప్రముఖ నిర్మాతలైన దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు లతో పాటు తెలుగుదేశం పార్టీ కి చెందిన ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

1974 లో వచ్చిన నీడలేని ఆడది చిత్రంతో ప్రభ హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆతర్వాత ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి తదితర హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేసింది. ముఖ్యంగా మహానటుడు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ లోని చిత్రం భళారే విచిత్రం అనే పాటలో ఎన్టీఆర్ కి ధీటుగా ప్రభ ప్రదర్శించిన అభినయాన్ని ఎవరు మర్చిపోలేరు. ప్రభ భర్త పేరు దేవభక్తుని రమేష్. ఆయన చాలా సంవత్సరాల క్రితమే మరణించారు.
![]() |
![]() |