![]() |
![]() |

భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సుమారు మూడు దశాబ్దాలపై నుంచే శంకర్ సినిమాలకి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా సామాజిక నేపథ్యంతో కూడిన ఎన్నో సినిమాలు తెరకెక్కించి శంకర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు రికార్డు కలెక్షన్స్ కి కూడా సృష్టించాయి. తాజాగా ఆయన రెండు భారీ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కిస్తున్నాడు. అందులో ఒకటి కమల్ హాసన్ ఇండియన్ 2 కాగా ఇంకొకటి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. ఇప్పుడు ఈ రెండు మూవీలకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది.
ఇండియన్ 2 మూవీ నిన్నటితో షూటింగ్ ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కమల్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తళుక్కుమన్నాయి. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మరి మా చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ని శంకర్ ఎప్పుడు పూర్తి చేస్తాడు అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే చరణ్ సినిమాని పక్కన పెట్టి శంకర్ కమల్ సినిమాని పూర్తి చేసాడని అంటున్నారు.
ఇండియన్ 2 సినిమాని 2015 లో అనౌన్స్ చేసిన శంకర్ 2018 లో షూటింగ్ ని స్టార్ చేసాడు. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఇండియన్ 2 షూటింగ్ వాయిదా పడుతు నిన్నటితో పూర్తి చేసుకుంది. ఇక నైనా శంకర్ గేమ్ ఛేంజర్ ని త్వరగా పూర్తి చెయ్యాలని చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
![]() |
![]() |