![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని ,మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లు గా శౌర్యవ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న మూవీ సాధించిన ఘన విజయం గురించి అందరికి తెలిసిందే. అలాగే ఆ సినిమా చాలా మంది ప్రేక్షకుల మనసుని కూడా గెలిచింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు నాని, మృణాల్, ఆ ఇద్దరికి కూతురు గా చేసిన కియారా ఖన్నాల నటనకి ఇప్పుడు ఈ సినిమా కథ సేమ్ నా కథే అని ఒకరు అంటున్నారు.
హాయ్ నాన్న లో విరాజ్ ( నాని) కూతురు మహి (కియారా) పుట్టుకతోనే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు ఉంటుంది. పైగా ఎప్పుడు చనిపోతుందో కూడా తెలియదు. ఇప్పుడు అచ్చం అదే వ్యాధితో విహాన్ అనే అబ్బాయి బాధపడుతు ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు.ఈ విషయం హాయ్ నాన్న విడుదల తర్వాత బయటకి వచ్చింది. హాయ్ నాన్న సినిమా చూస్తున్నంతసేపు మహి, విరాజ్, యష్ణ ( మృణాల్ ఠాకూర్ ) లను చూసినట్టుగా లేదని, తమను తాము చూసుకున్నట్టుగా ఉందని కొన్ని సీన్లు అయితే యాజిటీజ్‌గా ఉన్నాయని విహాన్ తండ్రి ట్విటర్ వేదికగా వెల్లడి చేసాడు. అలాగే ప్రతీ రోజూ తమ ఇంట్లో జరిగే సన్నివేశాలనే తెరపై చూస్తున్నప్పుడు చాలా ఏడ్చామని మూవీలోని ఒక సీన్ లో యశ్న, విరాజ్ లు కారులో వెళ్తు మహి విషయంలో బాధపడుతు అసలు మనం కలవకపోయి ఉంటే పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇలా కష్టాలు వచ్చేవి కాదని అనుకునే సీన్ అయితే తమ జీవితంలో ఎన్నో సార్లు రిపీట్ అయ్యిందని కూడా రాసుకొచ్చాడు.

సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ అదే వ్యాధి రూపమైన 65 రోజెస్ తో బాధపడే వారిని దగ్గర్నుంచి చూసినట్టుగా దర్శకుడు చాలా చక్కగా తన సీన్స్ ద్వారా చెప్పాడని దర్శకుడు శౌర్యవ్ ని అతను అభినందించాడు. కాగా శౌర్యవ్ గతంలోనే విహాన్ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నాని,మృణాల్ ఠాకూర్, కియారాలతో కలిసి ఆ కుటుంబాన్ని కలిశారు. బాబుతో స్పెండ్ చేసి అతనికి దైర్యం చెప్పడమే కాకుండా ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని కూడా మాటిచ్చారు.
![]() |
![]() |