![]() |
![]() |

2017 లో వచ్చిన వెళ్ళిపోమాకే చిత్రంతో తెలుగు తెర మీద తళుక్కున మెరిసిన నటుడు విశ్వక్ సేన్.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, హిట్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన కంటు మంచి గుర్తింపుని పొంది ప్రస్తుతం తన నూతన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా విశ్వక్ సేన్ నిన్న రోషన్ కనకాల హీరోగా వస్తున్న బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో పాల్గొని ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు.
విశ్వక్ సేన్ నిన్న బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వేసుకొని వచ్చిన చెప్పులు అందరి దృష్ఠ్టిని ఆకర్షించాయి.ఆ తర్వాత ఆ చెప్పుల ఖరీదు అక్షరాలా 98,975 రూపాయిలు అని తెలుసుకొని అందరు షాక్ అవుతున్నారు. 1025 రూపాయిల తక్కువగా లక్ష రూపాయిలా అని నోరెళ్లబెడుతు హీరోలు అంటే ఆ మాత్రం రాయల్టీ ఉండాలి కదా అని అనుకుంటున్నారు. కొంత మంది అయితే చెప్పులు దొంగతనం జరగకుండా చూసుకోమని విశ్వక్ సేన్ కి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ చెప్పుల విషయం హాట్ టాపిక్ అయ్యింది.

సుమారు 104 సంవత్సరాల క్రితం స్పెయిన్‌లో బ్రాండ్ బలెన్సియాగ అనే ఫేమస్ చెప్పుల బ్రాండ్ కంపెనీ ఉండేది. ప్రస్తుతం ఫ్రాన్స్‌కు చెందిన కెరింగ్ అనే లగ్జరీ గూడ్స్ సంస్థ బలెన్సియాగ బ్రాండ్ ని తన ఆధ్వర్యంలో నడిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కూడా లగ్జరీ గూడ్స్‌ను విక్రయించే ఈ సంస్థకు చాలా దేశాల్లో బొటిక్స్ ఉన్నాయి. ఇక విశ్వక్‌సేన్ వేసుకున్న చెప్పులు బలెన్సియాగ హార్డ్‌క్రాక్స్. పేరుతో రబ్బర్‌తో తయారుచేసిన మ్యూల్ సాండిల్స్. పైగా తమ బ్రాండ్ గొప్పతనం అందరికి తెలియాలనే ఉద్దేశంతో సిల్వర్ మెటల్ ప్లేట్ మీద బలెన్సియాగ లోగోను ముద్రించి చెప్పులకు ముందు, వెనుక
కూడా అమర్చారు.
![]() |
![]() |