![]() |
![]() |

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్థాయికి బన్నీ ఎదిగిన తీరు అందరకి తెలిసిందే. గంగోత్రి తో తన సినీ జర్నీని ప్రారంభించి ఆర్య బన్నీ, దేశముదురు, సరైనోడు, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురం, పుష్ప లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులని కూడా సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ని కూడా అందుకున్న బన్నీ తాజాగా సోషల్ మీడియా లో చేసిన ఒక పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో నిర్మించిన ఎన్నో చిత్రాల్లో విజేత సినిమా కూడా ఒకటి. చిరంజీవి హీరోగా 1985 లో వచ్చిన ఆ సినిమాలో వెంకటేష్ అనే క్యారక్టర్ లో అల్లు అర్జున్ నటించాడు.బన్నీ స్క్రీన్ షేర్ చేసుకున్న మొదటి చిత్రం కూడా ఇదే. ఇప్పుడు ఆ క్యారక్టర్ చేసినందుకే నాకు నిర్మాత డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. అల్లు అరవింద్ విజేత సినిమా 100 డేస్ షీల్డ్ ని పట్టుకొని ఉన్న పిక్ ని తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తు నా మొదటి సినిమా నిర్మాత మా డాడీ కానీ నాకు రెమ్యునరేషన్ ని ఇవ్వలేదని బన్నీ చెప్పాడు.

ఇప్పుడు బన్నీ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అయితే మీ డాడీ నే కదన్న అప్పుడు ఇవ్వ్వకపోతేనే ఇప్పుడు అడుగు అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |