![]() |
![]() |

ఒకప్పుడు థియేటర్లలోనే సినిమాలు చూసే రోజుల్లో సినిమా సూపర్‌హిట్ అయితే అర్థ శతదినోత్సవాలు, శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు ఆడి కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈమధ్యకాలంలో అర్థ శతదినోత్సవం జరుపుకున్న సినిమాలను వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. కలెక్షన్లపరంగా లెక్కలు పూర్తిగా మారిపోయాయి. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు రాబట్టుకోవాలనే ఆలోచనలోనే నిర్మాతలు ఉన్నారు. 50 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడిరది, 100 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడిరది అనే లెక్కలు పక్కన పెట్టి మొదటి రోజు కలెక్షన్లు, రెండో రోజు కలెక్షన్లు, ఫస్ట్‌వీక్ కలెక్షన్లు అంటూ సినిమా ఫలితాన్ని లెక్కిస్తున్నారు.
ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలను ఫస్ట్ డే కలెక్షన్స్‌ని బట్టే వాటి రేంజ్ తెలుస్తోంది. గతంలో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో బాలీవుడ్ సినిమాల రికార్డులే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సౌత్ సినిమాల హవా బాగా పెరిగిన తర్వాత బాలీవుడ్ సినిమాలు ఈ విషయంలో పక్కకు తప్పుకున్నాయి. అప్పటివరకు ఉన్న బాలీవుడ్ రికార్డులను ‘బాహుబలి’ తిరగరాసి టాప్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థానాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ దక్కించుకుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ టెన్‌లో ఏయే సినిమాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఫస్ట్ డే కలెక్షన్స్‌లో టాప్ టెన్ మూవీస్ ఇవే:
1. ఆర్‌ఆర్‌ఆర్ : రూ.223.5 కోట్లు
2. బాహుబలి 2 : రూ.214.5 కోట్లు
3. సలార్ : రూ.160 కోట్లు
4. లియో : రూ.145 కోట్లు
5. ఆదిపురుష్ : రూ.136.8 కోట్లు
6. సాహో : రూ.130 కోట్లు
7. జవాన్ : రూ.129 కోట్లు
8. కేజీఎఫ్ 2 : రూ.120 కోట్లు
9. పఠాన్ : రూ.106 కోట్లు
10. రోబో 2.0 : రూ.100 కోట్లు
పైన చూపిన లెక్కల ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్స్ అత్యధికంగా సాధించిన టాప్ టెన్ సినిమాల్లో బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు ఏకంగా నాలుగు ఉండడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.
![]() |
![]() |