![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ గుంటూరు కారం. మహేష్ ఫాన్స్ అయితే గుంటూరు కారం రిలీజ్ డేట్ అయిన జనవరి 12 ఎప్పుడు వస్తుందా థియేటర్ల దగ్గర మహేష్ ఫాన్స్ పవర్ ఏంటో చూపిద్దామని రెడీ గా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీ ఇప్పుడు విడుదలకి ముందే ఒక సరికొత్త రికార్డు ని సృష్టించింది.
ప్రముఖ ఆన్ లైన్ మూవీ టికెట్ యాప్ అయిన బుక్ మై షో లో గుంటూరు కారం మూవీ చూడాలని ఉందని 100 +k ఇంట్రెస్ట్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ వార్తలతో గుంటూరు కారం కి ఉన్న క్రేజ్ అర్ధం అవుతుంది. మహేష్ ఫాన్స్ అయితే ఈ రికార్డు జస్ట్ శాంపిల్ మాత్రమే అని రిలీజ్ దగ్గరకొచ్చే కొద్దీ మరిన్ని రికార్డు లని మహేష్ సృష్టిస్తాడని అలాగే మూవీ రిలీజ్ అయ్యాక అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటిని మరుగున పడేసి సరికొత్త రికార్డులని మహేష్ క్రియేట్ చేస్తాడని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న గుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు కథనాయికలుగా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
![]() |
![]() |