![]() |
![]() |

బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి సరిపోయే సరైన సినిమా రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు 'సలార్'తో దర్శకుడు ప్రశాంత్ నీల్ వారి ఆకలిని తీర్చాడని చెప్పవచ్చు.
హాలీవుడ్ హీరోలను తలదన్నే కటౌట్ ప్రభాస్ సొంతం. ఆ కటౌట్ ని సరిగ్గా వాడుకొని, అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్ తీస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. చాలారోజులకు ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడుకునే దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపంలో వచ్చాడు. సలార్ లో ప్రభాస్ ని ఆయన చూపించిన తీరుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నిజంగా స్క్రీన్ మీద రెబల్ స్టార్ ఒక డైనోసార్ లా కనిపించాడు. ప్రభాస్ లుక్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ యాక్షన్ హీరో అంటే ఇతనురా అనుకునేలా ఉన్నాయి. ప్రభాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ప్రశాంత్ నీల్ రూపొందించిన సీన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఫైట్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు అంటే నీల్ ఏ రేంజ్ రెబల్ స్టార్ ని చూపించాడో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి తర్వాత ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అని రెబల్ స్టార్ అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
![]() |
![]() |