![]() |
![]() |

2011లో వచ్చిన అనగనగ ఒక ధీరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటి శృతి హాసన్. అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తన తండ్రి కమల్ హాసన్ కి తగ్గ వారసురాలు అని అనిపించుకుంది. మరికొన్ని రోజుల్లో సలార్ తో పాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతున్న శృతి హాసన్ తనపై జరుగుతున్న ఒక కుట్రని బయటపెట్టింది.
శృతి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ప్రస్తుతం తాను చాలా హుందాతనమైన జీవితాన్ని అనుభవిస్తున్నాని కానీ నాకు ఆల్కహాల్ అలవాటు ఉందని కొంత మంది కావాలని చెప్తున్నారని దేవుడు అలాంటి వాళ్ళందరి సంగతి చూసుకుంటాడని చెప్పింది. ఎనిమిదేళ్ల క్రితం నాకు మద్యం అలవాటు ఉందన్న మాట నిజం.స్నేహితులతో కలిసి నైట్ పార్టీ లకి వెళ్లడం వల్లే డ్రింక్ చెయ్యాల్సొస్తుందని భావించి ఫ్రెండ్స్‌కు కూడా దూరంగా ఉన్నాను. అప్పటినుంచి మందు మానేసిన నాకు మొదట్లో కొంచెం కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందని కూడా శృతి చెప్పుకొచ్చింది. పైగా మద్యం తాగడంలో ఎలాంటి ఆనందం లేదనే విషయం అర్ధమయ్యి ప్రస్తుతం జీరో రిగ్రెట్, జీరో హ్యాంగ్ ఓవర్ తో హుందాగా ఉన్నానని కూడా అంది. అలాగే నేను నా లైఫ్ లో ఎప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. అలాగే స్మోకింగ్ వరెస్ట్ అంటూ కూడా చెప్పింది. జీవితంలో మళ్ళీ చెడు అలవాట్ల జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని కూడా శృతి చెప్పుకొచ్చింది.
శృతి హాసన్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది.శృతి ఇటీవల విడుదలైన నాని హాయ్ నాన్న సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. డిసెంబర్ 22న విడుదలవుతోన్న సలార్ ద్వారా తన సత్తా చాటబోతుంది. ప్రఖ్యాత నటుడు అడివి శేష్ తో కూడా శృతి హాసన్ ఒక సినిమాని చేస్తుంది.
![]() |
![]() |