![]() |
![]() |

అషురెడ్డి...ఇప్పుడు ఈ పేరు తెలియని వారు లేరు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన టిక్ టాక్ నుంచి ప్రారంభం అయిన ఈ అమ్మడి ప్రస్థానం బిగ్ బాస్ షో దాకా సాగింది. ఆ షో ద్వారా చాలా మంది అభిమానులని సంపాదించుకోవడమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు పొందింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేత తన కాళ్ళు నాకించుకోవడంతో సంచలనం సృష్టించిన అషు లేటెస్ట్ గా డ్రగ్స్ ఆరోపణలని కూడా ఎదుర్కొంది. ప్రస్తుతం అషు రెడ్డి తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షో లో ప్రముఖ హీరోతో చేసిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో సంచలనం సృష్టిస్తుంది.
భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అషు రెడ్డి ని హోస్ట్ గా ఎంచుకొని దావత్ అనే ఒక షో ని నిర్వహిస్తుంది. ఈ షోలో తాజాగా బేబీ సినిమా హీరోల్లో ఒకడైన విరాజ్ అశ్విన్ పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ప్రోమో చూస్తుంటే ఇంటర్వ్యూ మొత్తం కూడా అషు విరాజ్ ని తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకుందని అర్ధం అవుతుంది. నువ్వు వర్జిన్ వా విరాజ్ అని అషు అనగానే కాదు అని విరాజ్ సమాధానం ఇచ్చాడు. అప్పుడు మళ్ళీవెంటనే ఎన్ని సార్లు అని అషు అడిగింది. అలాగే సినిమాలో వచ్చే ముద్దు సీన్స్ గురించి కూడా అడిగింది. ఇప్పుడు ఈ ప్రోమో చూసిన వాళ్ళందరు వామ్మో అషు రెడ్డి ఇలాంటి హాట్ ప్రశ్నలు వేస్తుందేంటి అని అనుకుంటున్నారు. ప్రోమోనే ఇలా ఉంటే ఇక షో మొత్తం ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితమే బొమ్మరిల్లు సిద్దార్ధ్ కూడా ఈ షో లో పాల్గొన్నాడు. అప్పుడు కూడా అషు రెడ్డి సిద్దార్ధ్ ల మధ్య జరిగిన వాడి వేడి ఇంటర్వ్యూ చాలా పెద్ద సంచలనమే సృష్టించింది. ఇప్పుడు ఈ షో చూస్తున్న చాలా మంది అషు రెడ్డి దావత్ షో బాలీవుడ్ లో వచ్చే కాఫీ విత్ కరణ్ షో ని మించిపోయేలా ఉందనుకుంటున్నారు. ఎందుకంటే కాఫీ విత్ కరణ్ షో లో వ్యాఖ్యాత అయిన కరణ్ తనతో ఇంటర్వ్యూ లో పాల్గొన్న సెలబ్రిటీస్ ని చాలా బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు కరణ్ ని అషు రెడ్డి బీట్ చేస్తుందని అంటున్నారు.
![]() |
![]() |