![]() |
![]() |
ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్. డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌తో, డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపే శేష్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందినవే. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్.. ఇలా దేనికదే డిఫరెంట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే శేష్ ఇప్పుడు గూఢచారి 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాను ఇటీవల ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించే ఒక సినిమాను ఓకే చేశాడు. షానియల్ డియో దర్శకకత్వంలో రూపొందే ఈ సినిమాకి యార్లగడ్డ సుప్రియ నిర్మాత.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో శేష్‌కి జంటగా శృతిహాసన్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది. తను హీరోగా నటించే ప్రతి సినిమా సబ్జెక్ట్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటాడు. ముఖ్యంగా కథ, కథనాలను తనే సమకూర్చుకుంటాడు. తన ప్రతి సినిమా టైటిల్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకునే శేష్ ఈ సినిమాకి కూడా ఒక పవర్‌ఫుల్ టైటిల్ కోసం కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్‌ను ‘డెకాయిట్’గా అనుకుంటున్నారట. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమాలోని ఫైట్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
![]() |
![]() |