![]() |
![]() |

భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాల్లోను హీరో, హీరోయిన్, దర్శకులకి మాత్రమే ఎక్కువుగా గుర్తింపు ఉన్న ప్రస్తుత సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో తన కంటు ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ప్రకాష్ రాజ్. అన్నగా,తండ్రిగా ,తాతగా, బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా, మాఫియా డాన్ గా, వీధి రౌడీ గా ఇలా కళకి సంబంధించిన అన్ని పాత్రల్లోను రాణించి తనకంటూ సొంతంగా అభిమానులని కూడా సంపాందించాడు. అలాగే ప్రకాష్ రాజ్ సినిమాలో ఉన్నాడని చెప్పి ప్రేక్షకులు సినిమాకి వెళ్లేంతా కీర్తిని కూడా ఆయన సంపాదించాడు. తాజాగా తన సినిమాలకి సంబంధించిన ఒక విషయంలో ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణ చేసాడు.
ప్రకాష్ రాజ్ చాలా సంవత్సరాల తర్వాత తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆయన తన సినిమాలకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు వెల్లడించాడు. నేను కొన్ని సినిమాల్లో కేవలం డబ్బు కోసమే నటించాను.నేను చేసే సినిమాలో కథ,అందులో నా క్యారక్టర్ పరమ చెత్త అని తెలిసి కూడా డబ్బు కోసమే నటించానని ఆయన చెప్పాడు. అలాగే కొన్నిసినిమాల్లో నా క్యారక్టర్ నచ్చి డబ్బు తీసుకోకుండా కూడా నటించాను అప్పుడు కొంతమంది అలా డబ్బు తీసుకోకుండా ఎందుకు నటించావు అని కూడా నన్ను అడిగారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే మంచి క్యారక్టర్ వెయ్యడం ద్వారా వచ్చే తృప్తి ముందు డబ్బు చాలా చిన్నది అని ఆయన అన్నాడు.
అలాగే తన నటనని ఓవర్ యాక్టింగ్ అనే వాళ్లకి కూడా ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానంటే నాకు యాక్టింగ్ వచ్చని ఒప్పుకున్నట్టే కదా అని అన్నాడు. ఆయన ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం,ఎన్టీఆర్ దేవర ,అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నాడు.
![]() |
![]() |