![]() |
![]() |

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొట్టిన యానిమల్ సునామి ఇప్పుడు కొద్దీ కొద్దిగా నెమ్మదిస్తు ఉంది. కానీ నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ యానిమల్ గురించి పాజిటివ్ గా స్పందించడమో లేక నెగిటివ్ గా స్పందించడమో చేస్తుండటంతో అందరి నోళ్ళల్లో యానిమల్ నానుతూనే ఉంది. తాజాగా సమెక్య ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శక్తిని తన మేధోశక్తితో పరుగులు పెట్టేసేలా చేసిన ఒక పెద్దాయన యానిమల్ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రజలందరినీ ఆర్ధికంగా బలోపేతం చెయ్యాలనే లక్ష్యంతో లోక్ సత్తా పార్టీ ని స్థాపించిన వ్యక్తి జయప్రకాశ్ నారాయణ్. ఈయన ఎన్టీఆర్ హయాంలో చీఫ్ సెక్రటరీ గా కూడా పని చేసి ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యాక్రమాలు అందేలా చేసారు.ఆయన తాజగా ఒక ఇంటర్వ్యూ లో యానిమల్ సినిమాని ఉద్దేశించి మాట్లాడుతు సినిమా అనేది ఒక అధ్బుతమైన కళ.ఆ మాట ఎవరు కాదనలేరు.అలాగే సినిమా వల్ల మనుషులు చెడి పోవడం కానీ మారిపోవడం కానీ జరగదు.కానీ వారి ఆలోచనా విధానం పై మాత్రం సినిమా చాలా ప్రభావితం చూపుతుందని అన్నారు. అలాగే సినిమాని తెరకెక్కించే వారి పట్ల జయప్రకాష్ నారాయణ్ కొన్ని కీలక వ్యాఖ్యల్ని కూడా చేసారు. మంచి ఆలోచనలు కలిగేలా సినిమాలు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు ఆలోచనలు కలిగేలా మాత్రం సినిమాలు తెరకెక్కించకూడదు.

అలా అని సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలదే అని నేను అనడం లేదు. కానీ మేకర్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సమాజం పై భాద్యత వహించి సినిమాలు తీస్తే బాగుటుంది. అలాగే 90 వ దశకంలో వచ్చిన శివ,ఇప్పుడు వచ్చిన యానిమల్ లాంటి సినిమాలు చూస్తే నాకే ఎదుటవాడిని చంపేయాలనే భావన కలుగుతుంది. అలాంటిది ఈ తరం చిన్న పిల్లల్లో అయితే అవి మరింత ప్రభావం చూపిస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని దర్శకులు నిర్మతలు సినిమాలు తెరకెక్కించాలి అని జయప్రకాశ్ నారాయణ్ చెప్పుకొచ్చారు.ఆయన డబ్బుతో రాజకీయాలని నడపలేమనే ఉద్దేశంతో లోక్ సత్తా పార్టీ ని తీసేసారు.
![]() |
![]() |