![]() |
![]() |

తెలుగు సినిమా చరిత్రలో కొంత మంది హీరోల దర్శకుల కాంబినేషన్స్ కి ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. ప్రేక్షకుల్లో కూడా ఆ కాంబోలో వచ్చే సినిమాపట్ల ఎనలేని ఆసక్తి నెలకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందా ఎప్పుడెప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని స్క్రీన్స్ మీదకి వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక కాంబినేషనే దగ్గుబాటి రానా, తేజాల కాంబినేషన్ .ఇప్పుడు ఈ కాంబోలో ఒక కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.
రానా ,తేజల కలయికలో రాక్షసరాజా అనే కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన రానా లుక్ అండ్ టైటిల్ తో కూడిన ఒక పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అలాగే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని కూడా అతి త్వరలో ప్రకటిస్తాం అని కూడా చెప్పారు. వాస్తవానికి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తేజ రానాతో ఒక సినిమా చెయ్యబోయుతున్నానని ఆ సినిమా టైటిల్ రాక్షస రాజా అని కూడా చెప్పాడు. అప్పటి నుంచి ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని రానా అభిమానులు తేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఇప్పుడు ఈ ప్రకటనతో అందరు ఫుల్ ఖుషితో ఉన్నారు.

తేజ రానా కాంబోలో 2017 లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్నిసాధించింది. ఆ సినిమాలో రానా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పుడు ఈ రాక్షస రాజా చిత్రం ద్వారా మరోసారి రానా తన నటనకి ఉన్న కెపాసిటీ ని తెలియచేయబోతున్నాడని అభిమానులు బలంగా నమ్ముతున్న్నారు.
![]() |
![]() |